VIDEO: గర్భాంలో పారిశుద్ధ్య పనులు
VZM: మెరకముడిదాం మండలం గర్భాం గ్రామ పంచాయతీలో బుధవారం పారిశుద్ధ్య కార్మికులు కాలువ పూడికలను తీస్తున్నారు. ఈ పనులను పంచాయతీ ఈవో విశ్వనాథం పర్యవేక్షిస్తున్నారు. కాలువలో పేరుకుపోయిన పూడుకులను తీసి టాక్టర్ సాయంతో డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా, కాలువలో ఎటువంటి చెత్తాచెదారం వేయకుండా ఉండాలని ఈవో కోరారు.