పంటకాల్వలోకి దూసుకెళ్లిన ఆటో.. ముగ్గురు మృతి
BPT: కొల్లూరు మండలం దోనేపూడి వద్ద ఆటో పంటకాల్వలోకి దూసుకెళ్లిన ఘటన శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు పోలీసులు తెలిపారు. కొబ్బరికాయల లోడుతో వెళ్లున్న ఆటో అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతులు కాంతారావు, శ్రీనివాసరావు, ఇస్మాయిల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.