యూరియా కోసం రైతుల తోపులాట

KMR: బిబిపేట్ మండల సొసైటీలో శనివారం 30 టన్నుల యూరియా రావడంతో రైతులంతా ఒకేసారి తరలివచ్చారు. దీంతో సొసైటీ వద్ద తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, రైతులకు సర్దిచెప్పి, టోకెన్లు పంపిణీ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా బస్తాలు అందేలా చర్యలు తీసుకున్నారు.