వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: లబ్బి వెంకటస్వామి

NDL: దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి అన్నారు. సోమవారం నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు, నందికొట్కూరులో ఉన్న YSR విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, డాక్టర్ ధారా సుధీర్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.