నార్కట్ పల్లిలో దొంగల ముఠా అరెస్ట్

NLG: వ్యవసాయ మోటర్లను దొంగతనం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివరాలను DSP శివరాంరెడ్డి నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో వెల్లడించారు. మండల పరిధిలోని శాంపల్లికి చెందిన యువకులు జల్సాలకు అలవాటు పడి నాలుగేళ్లుగా వ్యవసాయ మోటార్లను దొంగిలిస్తున్నారని అన్నారు. ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి 24 ఓపెన్ వెల్ మోటార్స్, ఒక స్కూటీ రికవరీ చేశామన్నారు.