పూడికలను తక్షణమే తొలగించాలి: ఎమ్మెల్యే
కృష్ణా: కానూరు పప్పుల మిల్లు వంతెన వద్ద గడచిన కొన్ని రోజులుగా డ్రైనేజీ సమస్య కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సమస్యను అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి, సంబంధిత మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సందర్శించారు. డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడికలను తక్షణమే తొలిగించాలని సిబ్బందికి ఆదేశించారు.