పోలిని స్వర్గానికి పంపడంతో ప్రజల కష్టాలు కడతేరుతాయి

పోలిని స్వర్గానికి పంపడంతో ప్రజల కష్టాలు కడతేరుతాయి

ELR: నూజివీడు పట్టణంలోని శివ భక్తులు శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, పోలిని స్వర్గానికి పంపి, పరమేశ్వరుని దివ్య ఆశీస్సులు పొందారు. కార్తీక మాసం ముగియగానే అమావాస్య అనంతరం మార్గశిర పాడ్యమి రోజున అరటి డొప్పలలో దీపారాధన నిర్వహించి పోలిని స్వర్గానికి పంపడం ఆనవాయితీగా వచ్చిన సంప్రదాయం అని పెద్దలు తెలిపారు. ఇలా చేయడంతో కష్టాలు తొలగుతాయని ప్రజల నమ్మకం.