రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని, అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు.