వర్షానికి తడిసిన ధాన్యం
MDK: శివంపేట్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన రైతు బాలు రాజు పండించిన వరి ధాన్యం వర్షానికి తడిసి నల్లబడిపోయింది. నాణ్యత లేదనే కారణంతో కొనుగోలు కేంద్రం అధికారులు పంటను తీసుకోవడానికి నిరాకరించారు. కష్టపడి పండించిన పంటను ఇలా తిరస్కరించడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి నష్టపోయిన రైతుల ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.