'విధి నిర్వహణలో నిర్లక్ష్యం చెయ్యవద్దు'
AKP: నాతవరం మండలంలోని వైడీ.పేట, డీ.ఎర్రవరం, చెర్లోపాలెం సచివాలయాలను ఎంపీడీవో ఎంఎస్.శ్రీనివాస్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం సిబ్బందితో సమావేశమయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.