‘గ్రేడింగ్ రద్దుతో ఉపాధి కోల్పోతాం’

‘గ్రేడింగ్ రద్దుతో ఉపాధి కోల్పోతాం’

KRNL: ఆదోని మార్కెట్ యార్డులో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలన్న ఆదేశాలపై హమాలీ అసోసియేషన్ నాయకుడు తిమ్మప్ప వాల్మీకి సోమవారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌ను కలిశారు. గ్రేడింగ్ రద్దుతో వెయ్యి మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని తెలిపారు. యార్డులో కేవలం 3 నెలలే పని దొరకుతుందని, స్థానికంగా జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.