WWC: ఏ జట్టు ఎన్ని సార్లు కప్ గెలిచింది?
మహిళల వరల్డ్ కప్‌లో 1978 ఎడిషన్ నుంచి ఆడుతున్న భారత్ తొలి టైటిల్ సాధించింది. అయితే 1973 అరంగేట్ర ఎడిషన్ నుంచి అత్యధిక సార్లు కప్ కొట్టిన రికార్డ్ ఆస్ట్రేలియా పేరిట ఉంది. AUS ఏకంగా 7 సార్లు(1978, 82, 88, 97, 2005, 13, 22) కప్ గెలిచింది. ఆపై ఇంగ్లండ్ 1973, 93, 2009, 17 టోర్నీల విజేతగా నిలిచింది. ఇక భారత్ మాదిరే న్యూజిలాండ్ కూడా 2000లో తొలి, ఏకైక కప్ సాధించింది.