నీట్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలో మెరిసిన కుర్రాడు

TPT: గూడూరు పట్టణం కర్ణాలవీధి ప్రాంతానికి చెందిన డా.పర్వత కీర్తి కుమార్ దేశ వ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో సత్తా చాటాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 132వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం కీర్తి కుమార్ గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.