చిరుత సంచారం.. మేకల మందపై దాడి

చిరుత సంచారం.. మేకల మందపై దాడి

KMR: ఎల్లారెడ్డి మండలం అన్నసాగర్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మంగళవారం చిరుత సంచారం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రవీందర్, సురేందర్ మేకల మందపై చిరుత దాడి చేయడంతో మూడు మేకలు మృతిచెందాయి. ఈ ఘటనతో పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి బోన్ ఏర్పాటు చేసి, పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.