భార్య హత్య ఘటనపై సీఐ ఏమన్నారంటే ?

భార్య హత్య ఘటనపై సీఐ ఏమన్నారంటే ?

ప్రకాశం: గిద్దలూరులోని ఏబీఏం పాలెంలో గురువారం దారుణం జరిగింది. అనుమానంతో భార్య ప్రేమ కుమారిని భర్త గంగరాజు రోకల బండతో దాడి చేసి హతమార్చినట్లు సీఐ సురేష్ తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అర్బన్ సీఐ సురేష్ హత్య ఘటనను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.