అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యం పట్టివేత

VZM: ఎస్.కోట మండలం ధర్మవరం నుంచి బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 2400 కేజీల కోటా బియ్యాన్ని గంట్యాడ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. గంట్యాడ మండలం కొండతామరాపల్లి జంక్షన్ వద్ద ఎస్సై సాయికృష్ణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో ఈ బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.