విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BHPL: విద్యాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యతనిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం ఘణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంద మంది విద్యార్థులకు ఆయన యూనిఫాం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.