VIDEO: మండలంలో ఘనంగా హనుమాన్ దీక్ష
JGL: శ్రీరామనవమి సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో హనుమాన్ దీక్షదారులు ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. పంచముఖి హనుమాన్ ఆలయం నుంచి పల్లకిలో స్వామివారిని అలాగే, ప్రత్యేకంగా అలంకరించిన రథంలో స్వామి వారి చిత్రపటాన్ని కొలువుదీర్చి గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. భక్తులు అంజన్నకు మంగళ హారతులతో స్వాగతం పలికి పూజలు చేశారు.