పంచాయతీలకు ప్రత్యేక అధికారులు
AKP: పాయకరావుపేట మండలంలో పంచాయతీలకు ప్రత్యేక అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ నియమించినట్లు ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు. తను 4 పంచాయతీలకు, తహసీల్దార్ మహేశ్వరరావును 4 పంచాయతీలకు, మూడు పంచాయతీలకు ఎంపీడీవో కార్యాలయం ఏవో శరత్ బాబు, 4 పంచాయతీలకు ఏవో ఆదినారాయణ, ఐదు పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో జీవన్ లత, మూడు పంచాయతీలకు ఆర్.డబ్ల్యూఎస్ ఏఈ ఫణివర్మను నియమించారు.