నేడు గుడిపల్లిలో గాలికుంటు నివారణకు టీకాలు
NLG: గుడిపల్లి మండల కేంద్రంలో పశువులకు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలను బుధవారం వేయటం జరుగుతుందని సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రైతులందరు తమ పశువులకు టీకాలు తప్పకుండా వేయించుకోవాలని అన్నారు. పశువైద్యాధికారులు ఉదయం 7 గంటల నుంచి టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.