నేటి కార్యాచరణను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ
HYD: ఆర్టీసీ జేఏసీ నేటి కార్యాచరణను ప్రకటించింది. ఉదయం 5 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని డిపోల ఎదుట మహా ధర్నాకు పిలుపునిచ్చింది. మొదటిరోజు సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను, కార్మికులను తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్య పరిష్కారమయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని వారు హెచ్చరించారు.