సత్తెనపల్లిలో 'ప్రజా దర్బార్'
PLD: సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఇళ్లు, పెన్షన్లు, వైద్య సమస్యలపై వినతులు రాగా.. తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలా కాకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని కన్నా భరోసా ఇచ్చారు.