VIDEO: ఆర్టీసీ కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట
జనగామ పట్టణంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేరుకున్నారు. కార్మికులను లోపలికి అనుమతించాలని డిమాండ్ చేయగా పోలీసులు నిరాకరించారు. దీంతో కార్మికులు, బీఆర్ఎస్ నేతలు గేట్లు తోసుకుంటూ లోపలికి ప్రవేశించి డీఎం కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులతో తోపులాట చోటుచేసుకుని ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.