VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
E.G: దేవరపల్లి మండలం యర్నగూడెం HP పెట్రోల్ బంక్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యర్నగూడెంకి చెందిన కోడూరి రాజేష్, కట్టా కిరణ్‌కు గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.