మెరకముడిదాం గ్రామాన్ని కప్పేసిన పొగమంచు

మెరకముడిదాం గ్రామాన్ని కప్పేసిన పొగమంచు

VZM: మెరకముడిదాంలో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. తెల్లవారుజామున మంచు తెరలు తొలగకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయాన్నే ప్రయాణాలు చేసేవారికి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక అవస్థలు పడుతున్నారు. పొగమంచు ప్రభావం మామిడి పూతపై ప్రభావం చూపుతోందని రైతులు వాపోతున్నారు. పిల్లలు, వృద్ధులు ఈ పొగమంచు బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు పేర్కొన్నారు.