రైతు భరోసా దరఖాస్తులు స్వీకరణ
KNR: గంగాధర మండలం గర్షకూర్తి రైతు వేదికలో రైతు భరోసా దరఖాస్తులను స్వీకరిస్తునట్లు గర్శకుర్తీ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వి.గోపి చంద్ తెలిపారు. ఈనెల 25న చివరి తేదీ అని, త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులు భూమి పట్టా పాసుబుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్సులను సొసైటీ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.