మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
RR: మహేశ్వరం నియోజకవర్గం, పహాడీ షరీఫ్‌లో మహిళలు మొహమ్మదియా కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ మార్గదర్శకత్వంలో ఆరు నెలల ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేశారు. మహిళలకు కుట్టు మిషన్‌లను సంస్థ పంపిణీ చేసింది. స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా అసోసియేషన్ పనిచేస్తుందని సభ్యులు తెలిపారు.