VIDEO: గురుకుల బాలుర పాఠశాలను తనిఖీ చేసిన MLA
కృష్ణా: పామర్రు మండలం ఉరుటూరు శివారు నల్లగుంటలోని అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, విద్యా స్థాయి, వసతి సౌకర్యాలను పరిశీలించి సమస్యలు తెలుసుకున్నారు. భోజన నాణ్యత, పరిశుభ్రతపై సూచనలు ఇచ్చారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి సన్మానించారు.