వర్షం తగ్గింది.. చేపల వేట మొదలైంది

VKB: బొంరాస్‌పేట మండల వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలలోకి భారీగా వరద నీరు చేరుకొని నిండుకుండలా మారాయి. NH163 హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి సమీపంలోని ఏటి కాలువలో శుక్రవారం వర్షం తగ్గుముఖం పట్టడంతో జాలరులు చేపల వేటలో నిమగ్నమయ్యా రు. మరోవైపు మెట్లకుంట ఎల్లమ్మ వాగు దగ్గర యువకులు గాలాలతో చేపలు పడుతూ కనిపించారు.