మటన్ మార్కెట్ అభివృద్ధిపై హర్షం

GNTR: పొన్నూరులో మటన్, చేపల మార్కెట్‌ను అభివృద్ధి చేయడంపై బుధవారం వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మటన్ మార్కెట్‌లో సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. సమస్యను ఎమ్మెల్యే నరేంద్ర దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో కమిషనర్ మటన్ మార్కెట్‌ను అభివృద్ధి పరిచారని పేర్కొన్నారు.