వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి

వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి

KMR: ఎల్లారెడ్డి మండలం కట్టకింది తండాకు చెందిన మాలోత్ సెంటు(19) అనే యువకుడు తీవ్ర జ్వరంతో ఎల్లారెడ్డి దేవి హాస్పిటల్లో చేరాడు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే మరణానికి కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. బిచ్కుందలో సెంటు డిగ్రీ చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.