రైతులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

రైతులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

GDWL: రైతులు ఎవరూ అధైర్య పడవద్దు మీకు అండగా ఉంటాను అని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఉండవెల్లి మండల కేంద్రంలోని వరసిద్ధి వినాయక పత్తి మిల్లు యజమాన్యం సమ్మె కారణంగా నిలిచిపోయిన పత్తి కొనుగోలు సమస్య ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సంతోష్‌తో మాట్లాడారు. అనంతరం పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు.