ప్రాణం తీసిన భూతగాదా.. ఇద్దరిపై కేసు నమోదు

ప్రాణం తీసిన భూతగాదా.. ఇద్దరిపై కేసు నమోదు

ADB: భూతగదాల వల్ల ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉట్నూర్‌లో చోటుచేసుకుంది. బొద్దిగూడకు చెందిన రాథోడ్ మోహన్ పాత ఉట్నూర్‌లో నివాసం ఉంటున్నాడు. తన ఇంటి పక్కన ఉంటున్న రాజుతో మోహన్‌కు రహదారి విషయమై కొన్నేళ్లుగా గొడవలు జరిగాయి. ఈ క్రమంలో శుక్రవారం వారికి గొడవ జరగగా రాజు, అతడి భార్య హరిత కలిసి మోహన్‌పై దాడి చేశారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ మొగిలి తెలిపారు.