VIDEO: భగీరథ కాలనీ రోడ్డుకు దయలేదా
MBNR: ఎంబీఎన్ఆర్ భగీరథ కాలనీ నుంచి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. గత పాలకుల నిర్లక్ష్యంతో దెబ్బతిన్న రోడ్డులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లైనా మార్పు లేదని స్థానికులు మండిపడుతున్నారు. కార్పొరేషన్‌గా మారినా సమస్య అలాగే ఉందని, రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.