మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎంపీ
ATP: ధనాపురం గ్రామంలో నిర్వహించిన మహర్షి వాల్మీకి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదికవి వాల్మీకి ఆశీస్సులు సమాజంపై ఉండాలని, ఆయన చూపిన సత్యం, ధర్మం, న్యాయం మార్గంలో అందరూ నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.