తగ్గుముఖం పట్టిన మున్నేరు

తగ్గుముఖం పట్టిన మున్నేరు

ఖమ్మం: ఖమ్మం మున్నేరుకు వరద ఆదివారం ఉదయం తగ్గుముఖం పట్టింది. ఉదయం 7 గంటలకు నీటిమట్టం 13 అడుగులకు తగ్గింది. శనివారం రాత్రి గంట గంటకూ పెరుగుతూ 15 అడుగుల వరకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద తగ్గుముఖం పట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అవసరం లేకుండా పోయింది.