రక్షణ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) నిధులు సమకూర్చడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నిధులు ఉగ్రవాదులకు చేరే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరోక్షంగా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం సరికాదని అన్నారు. ఉగ్రవాదం ప్రపంచానికి ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. పాక్‌కు నిధులు ఇవ్వడంపై IMF పునరాలోచించాలని సూచించారు.