జర్నలిస్టుల సహకారం మరపురానిది: గంట్ల శ్రీనుబాబు
VSP: మూడు దశాబ్దాల జర్నలిస్టు జీవితంలో సహచరుల సహకారం మరపురానిదని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. బుధవారం అక్కయ్యపాలెం జంక్షన్ సమీపంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 30 ఏళ్ల సేవలో ఎక్కువ రోజులు విధుల్లోనే గడిపానని తెలిపారు. సూర్యప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలో వివిధ హోదాల్లో పనిచేశానన్నారు.