'సెన్సస్ శిక్షణ సమయాల్లో మార్పులు చేయాలి'
ADB: సెన్సస్ శిక్షణ సమయాల్లో మార్పులు చేయాలని PRTU తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా శిక్షణ సమయాన్ని సర్దుబాటు చేయాలని కోరారు. ముఖ్యంగా ఎండల తీవ్రత దృష్ట్యా సమయపాలనలో మార్పులు అవసరమన్నారు.