రోడ్డెక్కిన శనగ రైతులు
నంద్యాల జిల్లాలో శనగ కొనుగోలులో గోల్ మాల్ జరిగిందని రైతులతో TDP మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి రోడ్డెక్కారు. గోనె సంచులు ఇవ్వడం లేదని, రైతులకు అన్యాయం చేస్తున్నారని నిరసన చేపట్టారు. 'అధికార పార్టీలో ఉన్నామా? లేక ప్రతిపక్షంలో ఉన్నామా?. సహకార సొసైటీలో రైతులకు గోనె సంచులు ఇవ్వకుండా అధికారులు తిప్పుకుంటున్నారు. TDP వాళ్లకే ఈ పరిస్థితి అంటే.. ఇక సామాన్య రైతుల గతి ఏంటో?' అని మండిపడ్డారు.