మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట: ఎమ్మెల్యే

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ పల్లెల సర్వతోముఖాభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తిలో నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు.