'మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటాం'

KMM: నూతనంగా ఏర్పడిన కల్లూరు మున్సిపల్ కార్మికులకు ఏఐటీయూసీ అండగా ఉంటుందని ఆ సంఘ జాతీయ సమితి సభ్యులు బి.జి.క్లెమెంట్ భరోసా ఇచ్చారు. కల్లూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నూతనంగా ఏర్పాటుచేసిన ఏఐటియుసి జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐటియుసి రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.