స్వయం ఉపాధితో యువత రాణించాలి: MLA
ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే స్వయం ఉపాధి ద్వారా యువత రాణించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్‌లో నిర్వహిస్తున్న షార్ట్ టైమ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను తీసుకురానున్నాయని తెలిపారు.