శనిగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
KMR: రాజంపేట మండలం ఆర్గొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నేడు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో శనిగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ జిల్లా అధికారి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 12 శనిగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతుల నుంచి ప్రతి ఎకరాకు 7 క్వింటాళ్ల చొప్పున విక్రయాలు జరుపుతున్నామన్నారు