గద్వాల మోమిన్‌లో MMPL క్రికెట్ టోర్నమెంట్
గద్వాల మోమిన్ మొహల్లాలో MMPL క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలను మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ సర్పంచ్ అజయ్ ప్రారంభించారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని వారు పిలుపునిచ్చారు. క్రీడాకారులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.