టిమ్ డేవిడ్.. మెరుపు హాఫ్ సెంచరీ
మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం 23 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం 8.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.