ముళ్ళపొదలలో నవజాత శిశువు

ముళ్ళపొదలలో నవజాత శిశువు

NRPT: నారాయణపేట జిల్లా పరిధిలోని అప్పకుపల్లి గ్రామ సమీపంలో కాటన్ మిల్లు దగ్గర ముళ్ళపొదలలో నవ జాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. స్థానికులు పాపా ఏడుపులు విని 108కు సమాచారం అందించారు. హుటాహుటిన 108 సిబ్బంది అక్కడకు చేరుకొని అంబులెన్స్‌లో నారాయణపేట జిల్లా హాస్పిటల్‌కి తరలించారు. డాక్టర్ పరిశీలించి 108 సిబ్బందిని సూపర్వైజర్ రాఘవేంద్రను అభినందించారు.