PHCలో వైద్య సేవలు మెరుగుపరచాలి: కవిత
MDCL: బాలానగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత సందర్శించారు. రోగులకు, గర్భిణులకు అందిస్తున్న చికిత్స, పరీక్షలు, ఔషధాలు వంటి సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆసుపత్రిలో లభ్యమవుతున్న సదుపాయాలు, సిబ్బంది అందుబాటు, మౌలిక వసతుల అవసరాలపై వైద్యులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.