VIDEO: పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
కృష్ణా: గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పంచాయతీరాజ్ శాఖ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పంచాయతీల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయడం చాలా గొప్ప విషయమని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.