రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి.!

రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి.!

CTR: బంగారుపాళ్యం మండలం బెరుపల్లి సమీపంలో 2 బైకులు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. సీఐ కత్తి శ్రీనివాసులు వివరాల మేరకు.. ఆదివారం బేరిపల్లికి చెందిన రాజాబాబు సిద్దేశ్వర కొండకు వెళ్లి తిరిగివస్తున్న సమయంలో చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళ్తున్న ధర్మతేజ అతివేగంగా వచ్చి ఢీకొన్నట్లు సమాచారం. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో రాజాబాబు మృతి చెందాడు.